© 2026 nimisham.in

కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్‌చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్‌కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు. తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్‌కు వెళ్తాయి. కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు) ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
Sep 1 2026 6:25 AM | Updated on Sep 1 2026 6:25 AM
కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్‌చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్‌కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు.
తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు.
హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్‌కు వెళ్తాయి.
కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)
‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు
'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)
AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం
నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!
కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి