© 2026 nimisham.in

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను, తన కుటుంబం అత్యంత భక్తిశ్రద్ధలతో బహూకరించిన కోట్లాది రూపాయల విలువైన బంగారు పూత 'రామచరితమానస్' గ్రంథం అదృశ్యం కావడంపై కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన స్పష్టత కోరుతున్నారు.వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్, ఆయన భార్య సరస్వతి కలిసి 2024 ఏప్రిల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఒక అమూల్యమైన బహుమతిని సమర్పించారు. తులసీదాస్ రచించిన రామచరితమానస్లోని 10,902 శ్లోకాలతో కూడిన 522 పేజీలకు బంగారు పూత పూయించి, ఒక గ్రంథంగా రూపొందించారు. సుమారు 147 కిలోల బరువున్న ఈ గ్రంథం విలువ దాదాపు రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.ఈ గ్రంథాన్ని ఆలయంలో కొన్ని నెలల పాటు భక్తుల దర్శనార్థం ఉంచారని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా దానిని అక్కడి నుంచి తొలగించారని లక్ష్మీనారాయణన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎన్డీటీవీ'కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "రామజన్మభూమి ఉద్యమంతో మా కుటుంబానికి ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. నా దివంగత తల్లి ఏళ్ల తరబడి రామనామాన్ని రాశారు. నా పదవీ విరమణ తర్వాత వచ్చిన సంపాదనతో శ్రీరాముడికి సేవగా ఈ కానుకను సమర్పించాను. దీని ద్వారా గుర్తింపు కోరుకోవడం లేదు, కేవలం పారదర్శకత మాత్రమే కావాలి. ప్రతిరోజూ దానికి పూజలు జరిగేవి, భక్తులు దర్శించుకునేవారు. అప్పుడు నేను