© 2026 nimisham.in

భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ నింగి నుంచి ఒక అరుదైన, అద్భుతమైన శుభాకాంక్షల సందేశం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యా వ్యోమగాములు మన జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన స్నేహ బంధానికి, అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యానికి ఈ ప్రత్యేక సందేశం నిదర్శనంగా నిలిచింది.గగనతలంలో మువ్వన్నెల మెరుపులుఅంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ కాస్మోనాట్ ప్యోటర్ ద్యూబ్రోవ్, తోటి వ్యోమగాములతో కలిసి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ, ప్రియమైన భారతీయ మిత్రులారా.. మీకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన దేశ ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలతో వికసించాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 ఎట్ హోమ్ కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..యూరీ గగారిన్ జ్ఞాపకాలు.. ఆర్యభట్ట నుండి రాకేష్ శర్మ వరకుమానవుడు తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1961లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్, ఆ తర్వాత భారత్లో పర్యటించినప్పుడు అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంత అందంగా ఉందో, భూమిపై ఇక్కడి ప్రజల మైత్రి అంతకంటే అద్భుతంగా ఉంది అని కొనియాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1975లో భారత్ పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగానికి సోవియట్ యూనియన్ అందించిన సహకారం, 1984లో రష్యన్ నౌక ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రక ఘట్టాలను వ్యోమగాములు గుర్తుచేసుకున్నారు.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?గగన్యాన్ దిశగా కొత్త అధ్యాయంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల బంధం మరో కొత్త మైలురాయిని చేరుకుందని వ్యోమగామి
భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ నింగి నుంచి ఒక అరుదైన, అద్భుతమైన శుభాకాంక్షల సందేశం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యా వ్యోమగాములు మన జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన స్నేహ బంధానికి, అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యానికి ఈ ప్రత్యేక సందేశం నిదర్శనంగా నిలిచింది.గగనతలంలో మువ్వన్నెల మెరుపులుఅంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ కాస్మోనాట్ ప్యోటర్ ద్యూబ్రోవ్, తోటి వ్యోమగాములతో కలిసి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ, ప్రియమైన భారతీయ మిత్రులారా.. మీకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన దేశ ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలతో వికసించాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 ఎట్ హోమ్ కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..యూరీ గగారిన్ జ్ఞాపకాలు.. ఆర్యభట్ట నుండి రాకేష్ శర్మ వరకుమానవుడు తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1961లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్, ఆ తర్వాత భారత్‌లో పర్యటించినప్పుడు అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంత అందంగా ఉందో, భూమిపై ఇక్కడి ప్రజల మైత్రి అంతకంటే అద్భుతంగా ఉంది అని కొనియాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1975లో భారత్ పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగానికి సోవియట్ యూనియన్ అందించిన సహకారం, 1984లో రష్యన్ నౌక ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రక ఘట్టాలను వ్యోమగాములు గుర్తుచేసుకున్నారు.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?గగన్‌యాన్ దిశగా కొత్త అధ్యాయంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల బంధం మరో కొత్త మైలురాయిని చేరుకుందని వ్యోమగామి అన్నా కికినా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంపికైన భారత వ్యోమగాములు రష్యాలోని ప్రసిద్ధ గగారిన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందడం ఇరు దేశాల అతులిత సంబంధానికి అద్దం పడుతోందన్నారు. భారత్ - రష్యా మైత్రి అమరముగా వర్ధిల్లాలి అని వ్యోమగామి ఆండ్రీ ఫెద్యావ్ ఉద్ఘాటించడంతో ఈ వేడుక ముగిసింది.