
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)…ఇప్పుడు ఎక్కడా చూసినా, ఏ ఇండస్ట్రీలో అయినా ఆమె గురించే ముచ్చట. సొంత కన్నడ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసింది. బాలీవుడ్ లో కూడా సినిమాలు సైన్ చేస్తోంది. మళ్ళీ తెలుగులో పాన్ ఇండియా చిత్రాలు అందుకుంటోంది. ఇప్పుడు మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆమె నటిస్తున్న మొదటి మలయాళ చిత్రం షూటింగ్ మొదలైంది. ఆ ఫోటోని ఆమె తాజాగా షేర్ చేసింది. మలయాళ చిత్రసీమ అంటే ఆమెకి చాలా అభిమానం అని చెప్తోంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం గురించి స్పందించింది. “చాలా కాలంగా ఇష్టపడ్డ దానిలోకి అడుగుపెట్టినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకం. ఇప్పుడు అందులో చిన్న భాగంగా మారడం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను,” అని రాసుకొచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తోంది… నివిన్ (Nivin Pauly). అతనికి ఇది 51వ చిత్రం. మలయాళంలో ప్రేమమ్ వంటి సంచలన విజయాలు ఉన్న హీరో అతను
.