© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TGSRTC Changes Bus Routes: కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఫ్లైఓవర్ అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ నియంత్రించడానికి ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఈ మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో మళ్లింపులు చేపట్టారు. కీలకమైన ప్రాంతాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్న ఈ వన్-వే విధానం గురించి తెలియక చాలా మంది వాహనదారులు తమ ఆఫీసులకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈరోజు నుంచి వాహనదారులు ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మళ్లింపులు చేపట్టడమే కాకుండా బస్సు రూట్లను కూడా మార్చారు. కాబట్టి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ బస్సు మార్గాల్లో కీలక మార్పులు చేస్తూ, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ పరిసరాల్లోని బస్టాపులను కూడా మార్చింది. బస్ నంబర్ 47L రూట్.. సికింద్రాబాద్ లేదా జూబ్లీ బస్ స్టాండ్ నుండి మణికొండకు వెళ్లే ఈ 47L బస్సు.. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో హాస్పిటల్, ఫిల్మ్ నగర్, దర్గా, మణికొండకు చేరుతుంది. తిరిగి వచ్చే సమయంలో మణికొండ నుంచి పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్
చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్, టీవీ9, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఆర్ జె కాలేజ్, పోలీస్ లైన్ ప్లాజా మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్తుంది.
రూట్ నంబర్ 10H (సికింద్రాబాద్ నుండి కొండాపూర్): సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, మైత్రివనం, యూసఫ్‌గూడ చెక్ పోస్ట్, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరుతుంది. తిరిగి కొండాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేటప్పుడు బిగ్గెస్ట్ టెంపుల్, న్యూ హెచ్, వెంకటగిరి, యూసఫ్‌గూడ చెక్ పోస్ట్, మైత్రివనం, బేగంపేట్ మీదుగా సికింద్రాబాద్ చేరుతుంది.
బస్ నంబర్ 222A (కోటి నుండి పటాన్ చెరు).. కోటి నుంచి లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో హాస్పిటల్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా పటాన్ చెరుకు వెళ్తుంది. తిరిగి పటాన్ చెరు నుంచి కోటి వెళ్లేటప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్, పెద్దమ్మ దేవాలయం, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్, నాగార్జున సర్కిల్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్ మీదుగా కోటి చేరుతుంది.
బస్ నంబర్ 127L (కోటి నుండి కొండాపూర్): కోటి నుంచి లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో హాస్పిటల్, రోడ్ నంబర్ 45, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మీదుగా కొండాపూర్ వెళ్తుంది.
తిరిగి కొండాపూర్ నుంచి కోటి వెళ్లేటప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్, రోడ్ నంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, పెన్షన్ హౌస్, మాసబ్ ట్యాంక్ మీదుగా కోటి చేరుతుంది.
జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45 ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. బస్సు రూట్లు మారినందున, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటి నుంచి త్వరగా బయలుదేరాల్సి ఉంటుంది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 18వ తేదీ నుంచి మొదలైన ఈ పనులు సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగుతాయి. దాదాపు రూ.1090 కోట్ల వ్యయంతో 'హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్' చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.