
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. IBPS RRB Recruitment 2026: చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రామీణ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది, దీనికి అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 13,706 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం. ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. మొత్తం 8,183 ఆఫీస్ అసిస్టెంట్, 4,256 ఆఫీసర్ స్కేల్-1, 1,472 స్కేల్-2, 250 స్కేల్-3 ఉద్యోగాల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. వయస్సు.. వయోపరిమితి విషయానికి వస్తే: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1 కి 18 నుండి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి..SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PwD అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హతలు.. అర్హతల విషయానికి వస్తే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు డిగ్రీతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్