
నటీనటులు : నవీన్ వోలేటి, శ్రీనివాస్ చిలుకూరి, మైత్రేయి, ఆర్య అర్జున్ దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్ నిర్మాణం : రఘురాం, గీత సంగీతం : ఆర్పీ పట్నాయక్ ఛాయాగ్రహణం : లోకేష్ రెడ్డి కూర్పు : వేణు, నాని తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘గమ్యం’. ఆర్పీ పట్నాయక్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. యూఎస్ లోని డాలస్ లో క్యాబ్ డ్రైవర్ గా పని చేసే రవి (శ్రీనివాస్ చిలుకూరి) కి ఒక రోజు బిజినెస్ మెన్ మధుకర్ (నవీన్ వోలేటి) తో పికప్ డ్రాప్ వస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మాటల్లో ఒకరి కోసం ఒకరు కొంచెం తెలుసుకుంటారు. కానీ తన గమ్యాన్ని చేరే లోపే మధుకర్ కి జరిగిన ఊహించని ఘటనతో రవి ప్రశ్నలో పడతాడు. దీనితో అక్కడ నుంచి రవి ఏం చేసాడు అనేది అసలు కథ. కథా సుధలో ఆర్పీ పట్నాయక్ నుంచి ఇది మరో లఘు చిత్రం కాగా దీనిని కూడా యూఎస్ బ్యాక్ డ్రాప్ లోనే ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్. అయితే అక్కడ నేపథ్యంలో కూడా క్లీన్ సెటప్ తో దీనిని తెరకెక్కించారు. ముఖ్యంగా 2000 ల సమయంలో కనిపించిన ప్రముఖ నటుడు నవీన్ వోలేటిని చాన్నాళ్ళకి చూపించారు. తన పాత్ర బ్యాక్ స్టోరీ కూడా ఇందులో డీసెంట్ గా ఉంది. అలాగే యువ నటుడు శ్రీనివాస్ చిలుకూరి కూడా ఇందులో బాగా చేశారు. ఇద్దరి నడుమ కథనం మధ్యలో వచ్చే కాంఫ్లిక్ట్, ఆ తర్వాత కథనం కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయి. దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ దాదాపు కథనం నీట్ గానే నడిపించారు