
ఇంటర్నెట్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo Weds Georgina Rodriguez) ఓ ఇంటివాడయ్యాడు. గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న తన ప్రియురాలు 32 ఏళ్ల జార్జినా రోడ్రిగ్స్‌ను ఈ ఫుట్‌బాల్ స్టార్ వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు తమ వెడ్డింగ్ రింగ్‌లను చూపిస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టు చేశాడు. తన పేరులోని మొదటి అక్షరం ‘సి’.. జార్జినా పేరులోనే ‘జే’ అక్షరాల మధ్య లవ్ సింబల్‌ను పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చాడు. ఈ పోస్టుకు కేవలం ఏడు గంటల్లోనే 17.1 మిలియన్ల లైకులు రావడం గమనార్హం. అర్జెంటీనా-స్పానిష్ మోడల్ జార్జినా రోడ్రిగ్స్‌తో 41 ఏళ్ల రొనాల్డో దాదాపు పదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాడు. వీరిద్దరి వివాహంపై గతంలో చాలా రూమర్లు వచ్చాయి. కానీ, వాటన్నింటిని కొట్టిపడేశారు. ఇప్పుడు తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్టుతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. జార్జినాను తొలిసారి 2016లో రొనాల్డో (Cristiano Ronaldo) కలిశాడు. తమ అనుబంధంపై మరుసటి ఏడాదినే బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రకటించాడు. మొదట్లో తన రిలేషన్ ఈ స్థాయిలో బలపడుతుందని అనుకోలేదని.. రానురాను తన ప్రేమలో పడిపోయినట్లు రొనాల్డో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఐ యామ్ జార్జినా’ సిరీస్‌లో తెలిపాడు. రొనాల్డో - జార్జినా జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు