
హీరోయిన్ రితికా నాయక్ (Ritika Nayak)కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆమెకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఈ మాట చెబితే ఆమె ఊరుకోదు. తనకు బన్నీ అంటే ఇష్టం కాదు, పిచ్చి అంటోంది. ఇదేదో ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి మొదలైన పిచ్చి కాదు. ‘ఆర్య’ సినిమా చూసిన తర్వాత బన్నీకి వీరాభిమానిగా మారిపోయానంటోంది రితికా నాయక్. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్టు కూడా సెట్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎప్పటికైనా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటించాలనేది తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొచ్చింది. అమ్మడు టార్గెట్ బాగానే ఫిక్స్ చేసుకుంది. ఎటొచ్చి బన్నీ ఈమెను కన్సిడర్ చేస్తాడా అనేది డౌట్. ఎందుకంటే, ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నటించే హీరోయిన్లు కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండేవాళ్లనే తీసుకుంటున్నాడు. సో.. బన్నీ దృష్టిలో పడాలంటే పాన్ ఇండియా స్థాయిలో కాకపోయినా లోకల్ గానైనా రితికా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలి. ‘మిరాయి’తో ఇప్పటికే సక్సెస్ బాట పట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ, ‘కొరియన్ కనకరాజు’తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని తపిస్తోంది
.