భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలో ఉంటే ఎంటర్టైన్మెంట్కు కొదవ ఉండదు. తన బ్యాటింగ్‌తోనే కాకుండా చేష్టలతోనూ అతడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా శ్రీలంక లెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచులోనూ అదే జరిగింది. కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ తన బ్యాటింగ్ శైలితోనే కాక, ఫుట్‌బాల్ నైపుణ్యాలతోనూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగానే పెవిలియన్ చేరిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో మైదానంలోకి అడుగుపెట్టాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో అత్యంత జాగ్రత్తగా ఆడాడు. ఎంతలా అంటే.. మొదటి 21 బంతుల వరకు పరుగుల ఖాతానే తెరవలేదు. ధాటిగా ఆడే పంత్ ఇలా సుదీర్ఘంగా డిఫెన్స్ ఆడటం చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే క్రీజులో కుదురుకున్నాక పంత్ తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. శ్రీలంక బౌలర్లు కేశవ నువంత, దిలుమ్ సుదీరల బౌలింగ్‌లో విరుచుకుపడుతూ మూడు భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు.పంత్ సిక్సర్ల హోరును అడ్డుకోవడానికి స్పిన్నర్ సుదీర వైడ్ లెగ్ స్టంప్ దిశగా బంతులు వేయడం ప్రారంభించాడు. అయితే ఆ బంతులను వదిలేయకుండా, పంత్ తన కాళ్లతో ఫుట్‌బాల్ ప్లేయర్లా బంతిని వెనక్కి తన్నుతూ విన్యాసాలు చేశాడు. పంత్ చేసిన ఈ క్రేజీ పని చూసి మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి గాలే టెస్టుకు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు శ్రమించినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. ఆగస్టు 15న గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సీ