
'రిసార్ట్' వెబ్ సీరిస్ మొదటి సీజన్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ నెలాఖరుతో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరిస్ ఫస్ట్ సీజన్ కు ఫుల్ స్టాప్ పడబోతోంది. విజయ్ కుమార్ రాజేంద్రన్, అభినయ నేత్రన్ జంటగా రూపుదిద్దుకున్న 'రిసార్ట్' వెబ్ సీరిస్ మొదటి సీజన్‌కు గుమ్మడి కాయ కొట్టేశారు. ఆగస్ట్ 15వ తేదీతో ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ కు చెందిన వంద ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయ్యింది. ఇంటర్ తప్పిన ఓ గ్రామీణ యువకుడు, సిటీకి వచ్చి చెఫ్ అవ్వాలనుకున్న తన కోరికను ఎలా తీర్చుకున్నాడన్నదే ఈ వెబ్ సీరిస్ ప్రధానాంశం. కొన్నేళ్ళుగా రచన, దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న విజయ్ కుమార్ రాజేంద్రన్ దీనికి కథ, సంభాషణలు అందించాడు. అంతేకాదు ఇందులోని వెట్రీ అనే ప్రధాన పాత్రను పోషించాడు. ప్రవీణ్ బెన్నెత్ దర్శకత్వం వహించిన 'రిసార్ట్స్' వెబ్ సీరిస్ ఈ యేడాది మార్చి 13న జియో హాట్ స్టార్ లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున ప్రసారం చేస్తూ వచ్చారు. తమిళంలో పాటు వివిధ భాషల్లో దీనిని టెలికాస్ట్ చేశారు. ఆగస్ట్ 14వ తేదీతో 'రిసార్ట్స్' వెబ్ సీరిస్ 92 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ పూర్తయ్యింది. బాలెన్స్ ఉన్న ఎనిమిది ఎపిసోడ్స్ షూటింగ్‌ను తాజాగా పూర్తి చేసేశారు. సో.. మొదటి సీజన్ ఆగస్ట్ నెలాఖరుతో పూర్తి కాబోతోంది. ఈ వెబ్ సీరిస్ కథంతా ఆర్.ఆర్. రిసార్ట్స్ లోనే జరుగుతుంది. తన ఊరికే చెందిన ఉత్తమన్ (బడవ గోపి) సిఫార్స్ తో రూమ్ సర్వీస్ బోయ్ గా పనిచేయడానికి వెట్రీ (విజయ్ కుమార్ రాజేంద్రన్) వస్తాడు. ఎప్పటికైనా ఆర్.ఆర్. రిసార్ట్స్ కు మూల స్థంబమైన చీఫ్ చెఫ్ నెడుమారన్ (తలైవాసల్ విజయ్) అంత పేరు తెచ్చుకోవాలని అతని కోరిక. అయితే తమ కుటుంబాన్ని వదిలేసి, కష్టాల పాలు చేసి వెళ్ళిపోయిన తన తండ్రి చిదంబరం (గంజా