RBI Gold Bond Price: బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న చాలా ఆప్షన్లలో ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (సార్వభౌమ పసిడి బాండ్ల పథకం). గతంలో వీటిని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ తరచుగా ఇష్యూ చేసేది. ప్రతి నెలా కూడా కొత్త బాండ్లు వచ్చేవి. తర్వాత్తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున జారీ చేసేది. అయితే ఇప్పుడు పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్న కారణంతో కొంత కాలంగా ఆర్బీఐ కొత్త బాండ్లను జారీ చేయట్లేదు. అయితే ఈ స్కీమ్ కాల పరిమితి 8 ఏళ్లుగా ఉండటంతో గతంలో ఇష్యూ చేసిన వాటికి సంబంధించి డబ్బుల్ని ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటుంది. ఇంకా గడువు ముగియకుండానే స్కీంలో చేరిన ఐదేళ్ల తర్వాతి నుంచి డబ్బులు తీసుకునేందుకు వీలుంటుంది.ఇక్కడ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ డేట్ అని చెబుతారు. ఆ తేదీ నుంచి గోల్డ్ బాండ్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ పసిడి బాండ్ల ముందస్తు విమోచన ధర (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) కూడా ప్రకటిస్తుంది. తాజాగా SGB 2018-19 సిరీస్ VI గోల్డ్ బాండ్ స్కీమ్ ధరల్ని ఆర్బీఐ ప్రకటించింది. ఆగస్ట్ 12 అంటే ఇవాళ్టి నుంచే దీనిని రిడీమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక్కడ ఈ రిడెంప్షన్ డేట్‌కు ముందటి 3 రోజుల సగటు బంగారం ధరను ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్‌గా అనౌన్స్ చేసింది.2018-19 సిరీస్ VI గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్ గతంలో గ్రాముకు రూ. 3,326 గా నిర్ణయించింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లపై గ్రాముపైనే రూ. 50 డిస్కౌంట్ ఇస్తుంది. ఈ లెక్కన వీరికి గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ రూ. 3,276 కే వచ్చింది. ఇక ఇప్పుడు ముందస్తు విమోచన ధర గ్రాముకు ఏకంగా రూ. 15,102 గా ప్రకటించింది. దీంతో ఇక్కడ గ్రాముపైనే రూ. 15102- 3276= రూ. 11,826 లాభం రావడం విశేషం.Read Also: ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లు