
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన కేంద్రాల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. థియేటర్ల వద్ద హారతులు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా, సంగీతంపై కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉదయం షోల నుంచి మొదలైన ఈ జోరు షో టు షో మరింతగా పెరుగుతోంది. చాలా చోట్ల సెకండ్ షోలకు టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయి హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్ని సెంటర్లలోనూ భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్న ‘ఇరుముడి’, థియేటర్లలో సరికొత్త మాస్ జాతరను సృష్టిస్తోంది
.