© 2026 nimisham.in

సంచలనాలకు వేదికైన డిజిటల్ రవాణా రంగంలో ర్యాపిడో సంస్థ మరో భారీ మైలురాయిని అధిగమించింది. బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతి లభించింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్ 2016 నిబంధనల ప్రకారం ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితితో..ఆగస్టు 2031 వరకు ఈ లైసెన్స్ను మంజూరు చేశారు. కేవలం టాక్సీ క్యాబ్లకు మాత్రమే వర్తించే ఈ పక్కా చట్టబద్ధమైన పర్మిట్తో, ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించింది.ర్యాపిడో పురిటిగడ్డ అయిన కర్ణాటకలో ఈ సంస్థ రవాణా వ్యవస్థను ఎంతలా శాసిస్తోందో గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, బెలగావి, బళ్లారి, తుమకూరుతో సహా దాదాపు 21 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ సేవలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 3.14 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉపాధి పొందుతుండగా, 2.04 కోట్లకు పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. కేవలం క్యాబ్ సేవల కోసమే ఇప్పటివరకు 69 లక్షల మంది ప్రయాణికులు ఈ యాప్ను ఉపయోగించడం విశేషం Rapido Driver నిజాయితీ! 102 జ్వరం.. 8 గంటల లైవ్ లొకేషన్..అర్బన్ మొబిలిటీ మిషన్లో కీలక భాగస్వామి!ఈ చారిత్రాత్మక అనుమతితో పాటు, కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అర్బన్ మొబిలిటీ మిషన్ లో కూడా ర్యాపిడో సంస్థను భాగస్వామిగా చేర్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి, నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా సులభమైన ప్రయాణాన్ని అందించే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియమావళికి లోబడి పూర్తి భద్రతా ప్రమాణాలతో నడిచే ఈ క్యాబ్ సేవలు, ఐటీ సిటీలో ప్రతినిత్యం ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులకు, సామాన్యులకు గొప్ప ఊరటనివ్వనున్నాయిఏపీలో మరో కొత్త కార్యక్రమం.. డ్రైవర్లకు మంచి అవకాశండ్రైవర్లకు మెరుగైన
సంచలనాలకు వేదికైన డిజిటల్ రవాణా రంగంలో ర్యాపిడో సంస్థ మరో భారీ మైలురాయిని అధిగమించింది. బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతి లభించింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్ 2016 నిబంధనల ప్రకారం ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితితో..ఆగస్టు 2031 వరకు ఈ లైసెన్స్‌ను మంజూరు చేశారు. కేవలం టాక్సీ క్యాబ్‌లకు మాత్రమే వర్తించే ఈ పక్కా చట్టబద్ధమైన పర్మిట్‌తో, ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించింది.ర్యాపిడో పురిటిగడ్డ అయిన కర్ణాటకలో ఈ సంస్థ రవాణా వ్యవస్థను ఎంతలా శాసిస్తోందో గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, బెలగావి, బళ్లారి, తుమకూరుతో సహా దాదాపు 21 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ సేవలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 3.14 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉపాధి పొందుతుండగా, 2.04 కోట్లకు పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. కేవలం క్యాబ్ సేవల కోసమే ఇప్పటివరకు 69 లక్షల మంది ప్రయాణికులు ఈ యాప్‌ను ఉపయోగించడం విశేషం Rapido Driver నిజాయితీ! 102 జ్వరం.. 8 గంటల లైవ్ లొకేషన్..అర్బన్ మొబిలిటీ మిషన్‌లో కీలక భాగస్వామి!ఈ చారిత్రాత్మక అనుమతితో పాటు, కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అర్బన్ మొబిలిటీ మిషన్ లో కూడా ర్యాపిడో సంస్థను భాగస్వామిగా చేర్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి, నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా సులభమైన ప్రయాణాన్ని అందించే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియమావళికి లోబడి పూర్తి భద్రతా ప్రమాణాలతో నడిచే ఈ క్యాబ్ సేవలు, ఐటీ సిటీలో ప్రతినిత్యం ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులకు, సామాన్యులకు గొప్ప ఊరటనివ్వనున్నాయిఏపీలో మరో కొత్త కార్యక్రమం.. డ్రైవర్లకు మంచి అవకాశండ్రైవర్లకు మెరుగైన సంపాదన.. ప్రయాణికులకు భద్రత!ప్రభుత్వ అనుమతి రావడం పట్ల ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి సంతోషం వ్యక్తం చేశారు. మా సొంత రాష్ట్రంలో లభించిన ఈ గుర్తింపు మా బాధ్యతను మరింత పెంచింది. నిబంధనలకు లోబడి పూర్తి సురక్షితమైన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందిస్తూనే, మా కెప్టెన్ల ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తాం. భవిష్యత్తు రవాణా అవసరాలకు తగ్గట్టుగా కర్ణాటక ప్రభుత్వంతో కలిసి దీర్ఘకాలిక భాగస్వామిగా ముందుకు సాగుతాం అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ప్రభుత్వ లైసెన్స్‌తో ర్యాపిడో సాధించిన ఈ విజయం, డిజిటల్ టాక్సీ రవాణా రంగంలో ఒక సరికొత్త విప్లవానికి బాటలు వేసిందనడంలో సందేహం లేదు!