© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Rangareddy Shabad POCSO 6 Murders: పోక్సో కేసు పెట్టారనే పగతో నిందితుడు ఊచకోతకు దిగాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఈ శనివారం తెల్లవారుజామున అత్యంత కిరాతకమైన మర్డర్స్ జరిగాయి. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ (28) అనే వ్యక్తి కత్తితో దాడి చేసి మొత్తం ఆరుగురిని చంపేశాడు. మృతుల్లో నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా, బాధిత బాలిక, ఆమె తల్లి ,నానమ్మలను కూడా కత్తితో పొడిచి నిందితుడు అంతమొందించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబాద్ మండలంలో జరిగిన ఈ దారుణ హత్యల గురించి తెలుసుకున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, DCP యోగేష్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడు దారుణంగా హత్యకు పాల్పడినట్లు సమాచారం. ముగ్గురిని పొలంలో, మరో ముగ్గురిని తన ఇంట్లోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. షాబాద్‌లో జరిగిన ఈ పోక్సో హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి తల్లి మే 16వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే, ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు నిందితుడు. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి ఈ ఘోర హత్యలకు పాల్పడ్డాడు. అయితే, హత్య చేసిన తర్వాత ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో, వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
.