
ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి రమ్యకృష్ణ మరో పవర్‌ఫుల్‌ పాత్రతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మంచు మనోజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘డేవిడ్‌ రెడ్డి’లో (David Reddy) ఆమె కమలా రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ పవర్‌ఫుల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను పంచుకుంది. ఈ లుక్‌ సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చెబుతోందని మంచు మనోజ్‌ పోస్ట్‌ పెట్టారు. ఆమెతో (Ramya krishna) కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. హనుమా రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మారియా ర్యాబోషాప్కా కథానాయికగా కనిపించనున్నారు. 1897, 1920ల మధ్య బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో సముద్రఖని, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.