© 2026 nimisham.in

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప’రామాయణ: పార్ట్ 1′ (Ramayana: Part 1) ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ‘రామాయణ’ ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్టార్ కాస్టింగ్ ట్రైలర్‌కు మరో పెద్ద బలంగా మారింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి VFX, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ‘రామాయణ: పార్ట్ 1’ పై అంచనాలు మరింత పెరిగాయి. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్ఈజీ (DNEG), యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి 2026 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది
.