రంభ ఊర్వశి మేనక

జగన్ మోహన్ రెడ్డి తన పాలన లో బీసీ లకి రాజ్యసభలో దేశంలో వున్నా అన్ని పార్టీలకన్నా కూడా ఎక్కువుగా బీసీ లకి ప్రాధాన్యత ఇచ్చాడు.
గతం లో రాజ్యసభ్య స్థానాలకి ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్నయ్య కి ఇవ్వటంతో పాటు బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, దాదాపు 50 శాతం పైగా బీసీ లకి ఇవ్వటం లో పైచేయి సాధించాడు అని చెప్పాలిసిందే..

ఇకపోతే బీసీలే వెన్నుముక గ ప్రస్థానం ప్రారంభించిన తెలుగు దేశం పార్టీ ఈ దఫా ఎంత మంది బీసీ లకి ప్రాధాన్యత ఇస్తుంది అనేది వేచి చుడాలిసిందే.

దాదాపు టీడీపీ కోర్ ఓటు బ్యాంకు అయిన బీసీలని తన వైపు మార్చుకునే ఉద్దేశంలో జగన్ బీసీలకి పెద్ద పీట వెయ్యటమే కాకుండా ఆ దిశగా విజయం కూడా సాధించాడు. ఇప్పుడు రాజకీయ సమీకరణాల నేపథ్యం లో చంద్రబాబు, లోకేష్ బీసీ లకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఆశక్తిగా రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జూన్ నాటికి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారివే. ఆ సీట్లలో ఒక్క సీటు కూడా వైసిపి ఇప్పుడు గెలుచుకునే అవకాశం లేదు. ఖాళీ అవుతున్న నాలుగు సీట్లలో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమణ్ నత్వానీ మరొకటి టిడిపి నుంచి ఏడాది క్రితమే ఎన్నికైన సాన సతీష్ ది.

ఈ నాలుగు సీట్లు కూటమి పార్టీలు గెలవడానికి అవకాశం ఉంది. సంఖ్య రీత్యా నాలుగు సీట్లను కూటమి పార్టీలు పంచుకోబోతున్నాయి. వాటిలో ఒక సీటు బిజెపి, జనసేనకు కేటాయించవచ్చు. మరో మూడు సీట్లు టిడిపి తీసుకోబోతున్నట్లు సమాచారం. బిజెపి ఆ సీటును ఎవరికి కేటాయించబోతుంది అనేది ఇంకా బయటకు రాలేదు. జనసేన మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు కేటాయించవచ్చని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇక టిడిపికి సంబంధించిన మూడు సీట్లలో ఒకటి మళ్లీ సాన సతీష్ కే కేటాయించనున్నట్లు తెలిసింది. ఆయన ఓసి. కాపు సామాజిక వర్గం. మిగిలిన రెండు టిడిపి ఏ సామాజిక వర్గానికి కేటాయించబోతోంది..? అనేది ఇంతవరకు బయటకు రాలేదు. ఆ రెండు సీట్లు ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు..?

అనే అంశంపై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ సీట్లు బీసీలకు కేటాయించకపోతే అధికార టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి కనపడుతోంది. ఉన్నత సభకు సభ్యులను పంపే విషయంలో బీసీలకు టిడిపి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. వైసిపి ఏర్పడిన తరువాత 10 కి పైగా సభ్యులను ఆ పార్టీ రాజ్యసభకు పంపింది. వారిలో సగం మంది బీసీలే. వైసిపి ద్వారా ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్రావు రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్లంతా ఆ పార్టీలో ఉన్నారా..లేరా… అనేది వేరే విషయం.