© 2026 nimisham.in

పోలీసుల ముందే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన అత్యంత దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాయం కోరుతూ పోలీస్ బూత్ వద్దకు వచ్చిన యువకుడు, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. గాజియాబాద్‌లో జులై 12న జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.బీహార్‌కు చెందిన రాజ్‌కుమార్ (22) గాజియాబాద్‌లోని సంజయ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ నెల 12న ఓ ఆటో డ్రైవర్‌తో ప్రయాణ ఛార్జీ విషయంలో గొడవపడ్డాడు. ఆ గొడవ పెద్దదవడంతో, భయపడిన రాజ్‌కుమార్ సమీపంలోని మహిళా పోలీస్ 'పింక్ బూత్' వద్దకు సాయం కోసం పరుగెత్తాడు. అయితే, ఆ సమయంలో బూత్ తలుపులు మూసి ఉన్నాయి. లోపలున్న పోలీసుల దృష్టిని ఆకర్షించేందుకు గాజు తలుపును గట్టిగా బాదడంతో అది పగిలి అతడి చేతి నరాలు తెగిపోయాయి. దీంతో తీవ్ర రక్తస్రావం మొదలైంది.దాదాపు 40 నిమిషాల పాటు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నా పోలీసులు బయటకు రాలేదని, పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. చివరికి అతడు రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. రాజ్‌కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, లోపలున్న మహిళా కానిస్టేబుళ్లు భయపడి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. పెట్రోలింగ్ బృందం 8 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి