© 2026 nimisham.in
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జైలర్ 2' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.'జైలర్ 2' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లే 2026 అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో రజనీ చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు.'జైలర్ 2' నుంచి ఇటీవల వచ్చిన 'అలా బోలేలో' సాంగ్ వైరల్ అవుతోంది. అంతకముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు
.