
Panchali Panchabhartruka Review : రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. సరీ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి, పృథ్వీ, బాల, సునీత.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాంచాలి పంచభర్తృక సినిమా నేడు ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయింది. డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు ఎత్తుకెళ్ళి చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్‌లో సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసుకునే చిత్తరంజన్ (జెమిని సురేష్)కు సినిమా తీయాలని కోరిక. దాని కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్రాజ్, పుష్పరాజ్ లను చిత్తరంజన్ తన పెంట్ హౌస్‌లో ఉండమని చెప్పి వాళ్ళ ముగ్గురితో పాటు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ కలిసి నలుగురూ క్లోజ్ అవుతారు. ఒకరోజు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ప్లాన్ చేసి సెనోరిటా(సరీ ఫర్)ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఆమె వచ్చిన తర్వాత నలుగురూ ఓ పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి సెనోరిటా చనిపోయి ఉంటుంది. దాంతో భయపడి ఆ శవాన్ని మాయం చేద్దామని సూట్‌కేసులో పెడితే ఆ సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు సెనోరిటా ఎలా చనిపోయింది? ఆమె శవం ఎవరు తీసుకెళ్లారు? డాక్టర్ దమయంతి కథేంటి? ఈ మధ్యలో పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్)ఎవరు? రోజ్మేరి పాత్ర ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. పాంచాలి పంచభర్తృక టైటిల్ క్రేజీగా ఉండటం, రాజేంద్రప్రసాద్ ఫుల్ కామెడీ సినిమాతో రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ తో పాత్రలు పరిచయం కొత్తగా ఉంటుంది. పాత్రల పరిచయం వెరైటీగా, పాత్రల పేర్లు ఆసక్తికరంగా ఉంటాయి. నలుగురు వ్యక్తులు కలిసి అమ్మాయిని