
Rajahmundry: రివర్‌ఫ్రంట్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు లేదు రాజమండ్రి: గోదావరి గట్టున నిర్మాణ దశలో ఉన్న రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనుల నేపథ్యంలో అక్కడ ఉన్న వివిధ మహనీయుల విగ్రహాల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. విగ్రహాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులతో నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వారు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి పనులతో ప్రస్తుతం ఉన్న విగ్రహాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అధికారులు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు తుది రూపకల్పనలో భాగంగా విగ్రహాలను తొలగించడం కాదని, అవసరమైన చోట యూనిఫామ్ రీలోకేషన్, సమాన దూరం, ఒకే అలైన్మెంట్, సమానమైన ప్లాట్‌ఫామ్ డిజైన్‌తో క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం మాత్రమే ఉద్దేశమని వివరించారు. రివర్ఫ్రంట్లోకి ప్రవేశించే వారు, నడిచే ప్రజలు, బయట నుంచి చూసే సందర్శకులు అందరికీ విగ్రహాలు ఒకే తరహా డిజైన్‌లో కనిపించేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని విగ్రహాలు ఒకే లైన్లో ఉండగా, మరికొన్ని విభిన్న ప్రదేశాల్లో లేదా ఎత్తుపల్లాల్లో ఉండటంతో మొత్తం రివర్‌ఫ్రంట్ అందం, సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల సిమెట్రికల్ డిజైన్, సమాన విరామాలు, యూనిఫామ్ అలైన్మెంట్ ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆలోచనను నిర్వాహకుల ముందుంచారు. విగ్రహాల రూపం, పేర్లు, గుర్తింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే, కమిషనర్ స్పష్టం చేశారు. ఒక్క పేరు కూడా తప్పిపోకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి విగ్రహానికి సంబంధించిన వివరాలను నిర్వాహకుల సమక్షంలోనే పరిశీలించి, వారి ఆమోదం అనంతరం తుది రూపకల్పనలో పొందుపరుస్తామని తెలిపారు. మహనీయుల పేర్లు, విగ్రహాల గుర్తింపు విషయంలో ఎలాంటి చిన్న తప్పిదానికీ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని విగ్రహాలకు సాధ్యమైనంత వరకు ఒకే