© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Railway 4,908 Jobs Recruitment: చాలా కాలంగా రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల 21వ తేదీ ఎంతో కీలకమైనది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలోని 4908 సాంకేతిక ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపర్ ఇంటెండెంట్, కెమికల్ మెటల్ అసిస్టెంట్ వంటి పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో పెర్మనెంట్ విభాగంలో 845, వర్క్స్ విభాగంలో 470, క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగంలో 450 ఖాళీలు ఉన్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ఖాళీల వివరాలతో కూడిన సర్క్యులర్‌ను సంబంధిత రైల్వే జోన్లకు పంపింది. అంతర్గత హెచ్ఆర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆధారంగా ఈ పోస్టుల నియామక ప్రక్రియ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం, నోడల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అంతేకాకుండా, బెంగళూరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌తో సంప్రదించిన కేంద్ర మంత్రిత్వ శాఖ, నియామకాల కాలపరిమితిని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం నోటిఫికేషన్‌కు సంబంధించిన అంతర్గత చర్యలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాను అంతర్గత వ్యవస్థలో అప్లోడ్ చేసే ముందు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. మరోవైపు, ఇటీవల 6,565 టెక్నీషియన్ పోస్టుల నియామకానికి కూడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 323 పోస్టులు సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్-1 కి, 6,242 పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్-3 కి
సంబంధించినవి.
వివిధ రైల్వే యూనియన్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన విభాగాల్లో పోస్టుల భర్తీ చేయడం వల్ల ఆపరేషనల్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, ప్రస్తుత సిబ్బందిపై పని భారం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరల్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మాట్లాడుతూ, లక్షలాది మంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిన రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తాను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, 197 జూనియర్ ఇంజినీర్ (సిగ్నల్), 79 జూనియర్ ఇంజనీర్ (టెలి కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం 4908 సాంకేతిక పోస్టులు ప్రధాన రైల్వే జోన్ల పరిధిలోకి వస్తాయి.
ఈ ఉద్యోగాలకు పే లెవల్-6 వర్తిస్తుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ. 35,400 నుండి ప్రారంభమవుతుంది.. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. రైల్వే ఉద్యోగాల్లో లభించే సౌకర్యాలతో పాటు, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి, ఆర్ఆర్బీ (RRB) వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించి సమర్పించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.