
బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. విశాఖపట్నం, ఆగస్టు11: బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు ఎంవీపీ కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డిపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనంతోపాటు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రముఖ అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివ నారాయణ, జర్నలిస్టులు నరేష్, ఉదయ్, సాయిరాంతోపాటు సువర్ణ, హరిణ్య రెడ్డి, కార్తీక్, కేఆర్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్‌కు యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండో ఫిర్యాదు యువతి ఇచ్చింది. దీనిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు రూ. కోటి డిమాండ్ నెరవేరక పోవడంతోనే ఈ ఫిర్యాదు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడు నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతోపాటు ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. పోలీస్ వర్గాల్లో