
జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను వినాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కోరారు. ఈ మేరకు ఆగస్టు 14న సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు (Rahul Gandhi letter to Hemant Soren). జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన నియామక పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీక్, నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రాంచీలో కొనసాగుతున్న ఈ నిరసనలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళన ఇప్పటివరకు శాంతియుతంగానే సాగుతోందని, వారి డిమాండ్లు న్యాయమైనవని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు (Jharkhand student protest). 'గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది (Jharkhand exam row). జార్ఖండ్‌లోని పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడటానికి ముఖ్యమంత్రి స్వయంగా విద్యార్థులను కలిసి వారి ఆందోళనలను వినాలి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి' అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే