
క్రికెట్లో బ్యాటర్ గొప్పతనాన్ని కేవలం పరుగులు, సెంచరీలతోనే కొలవలేం. కొన్ని రికార్డులు ఆటగాడి ఓపిక, ఏకాగ్రత, టెక్నిక్, వికెట్ కాపాడుకునే సామర్థ్యాన్ని చెబుతాయి. అలాంటి రికార్డుల విషయానికి వస్తే భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరు ముందుంటుంది. ‘ది వాల్’గా పేరు తెచ్చుకున్న ద్రవిడ్ టెస్టు క్రికెట్లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా ఇప్పటికీ ఆ అద్భుతమైన రికార్డు అతని పేరిటే ఉంది. 1996లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రం చేసిన ద్రవిడ్.. 2012లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో చివరి టెస్టు ఆడాడు. 16 ఏళ్ల టెస్టు కెరీర్లో మొత్తం 164 మ్యాచ్‌లు, 286 ఇన్నింగ్స్‌లలో 31,258 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ సంఖ్య ఇప్పటికీ టెస్టు చరిత్రలో అత్యధికం. ఈ రికార్డుకు ద్రవిడ్ బ్యాటింగ్ శైలి ప్రధాన కారణం. బౌలర్ ఎంత కఠినమైన బంతి వేసినా దానిని వదిలేయడం, డిఫెన్స్ చేయడం, ప్రమాదకర షాట్లకు దూరంగా ఉండటం అతడి ప్రత్యేకత. అందుకే ప్రత్యర్థి బౌలర్లకు అతడిని ఔట్ చేయడం అంత సులభంగా ఉండేది కాదు. ద్రవిడ్ కేవలం ఎక్కువ బంతులను ఎదుర్కోవడమే కాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సమయం క్రీజులో గడిపిన బ్యాటర్ కూడా. అతడి మొత్తం క్రీజ్ టైమ్ 44,152 నిమిషాలు. అంటే దాదాపు 736 గంటలు లేదా 30 రోజులకు పైగా బ్యాటింగ్ చేసినట్టే. ఈ గణాంకం ద్రవిడ్ ఎంతటి సహనంతో బ్యాటింగ్ చేసేవాడో చెబుతుంది. టెస్టు మ్యాచ్‌లో ఒక సెషన్ తర్వాత మరో సెషన్.. ఒక రోజు తర్వాత మరో రోజు బ్యాటింగ్ కొనసాగించడం అతడికి కొత్తేమీ కాదు. ద్రవిడ్ రికార్డులు కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. తన 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు సాధించాడు. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 52.31. అత్యధిక వ్యక్తిగత స్కోరు 270 పరుగులు. అంటే ద్రవిడ్ క్రీజులో సమయం గడిపి వికెట్ కాపాడటం మాత్రమే