
రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు నీళ్లు: 1 కప్పు పల్చటి మజ్జిగ: 1 కప్పు వేయించిన జీలకర్ర పొడి: అర స్పూన్ పచ్చి మిర్చి తరుగు: అర స్సూను ఉప్పు: రుచికి సరిపడా కొత్తిమీర తరుగు: ఒక స్పూను ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి కలపాలి. ఎక్కడ చిన్నపాటి ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలి. దీనికోసం నీటితో రాగి పిండిని పావుగంట సేపు నీటిలో నానబెడితే మంచిది. ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. ఆ నీళ్లు మరిగాక ముందుగా నానబెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ఓసారి కలుపుకుని మరుగుతున్న నీటిలో వేసి కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద మిశ్రమాన్ని చిన్న మంట మీద సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. గరిటెతో కలుపుతునే ఉండాలి. ఇది చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి రాగి మిశ్రమం కాస్త చల్లారాక మజ్జిగ, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా తాజా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. ఇలా రాగి అంబలి రోజూ చేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇలా తాగితే ఎంతో ఆరోగ్యం. Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్ Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు