© 2026 nimisham.in
దేవుళ్లలా వచ్చారు.. ఒక్క క్షణం లేటైనా ఎంత ఘోరం జరిగేదో..! మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలో ఉన్న రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక భారీ ట్రక్కు హఠాత్తుగా బ్రేక్డౌన్ అయి పట్టాలపైనే నిలిచిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ వాహనం ముందుకు కదల్లేదు. సరిగ్గా అదే సమయంలో రైలు రాక కోసం గ్రీన్ సిగ్నల్ పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే, అటుగా వెళ్తున్న క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (QRF) సిబ్బంది ప్రమాదాన్ని గమనించి క్షణాల్లో స్పందించారు. స్థానికుల సహాయంతో ఆ భారీ ట్రక్కును పట్టాలపై నుంచి పక్కకు నెట్టివేసి సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించారు. మధ్యప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ సాహసోపేతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తకు సంబంధించిన