
ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) కోచ్‌లోకి దూరేందుకు 10 అడుగుల కొండచిలువ (Python) యత్నించింది. దీంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. దెహ్రాదూన్-ఆనంద్ విహార్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వాషింగ్ కోసం గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో హరిద్వార్ స్టేషన్‌లోని ‘వాషింగ్ లైన్’ వద్దకు చేరుకుంది. సిబ్బంది దానిని శుభ్రం చేస్తుండగా.. ఓ కొండచిలువ కోచ్‌లోకి దూరేందుకు యత్నిస్తుండడాన్ని గమనించారు. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న హరిద్వార్ ఫారెస్ట్ రేంజ్ బృందం రెండు గంటల పాటు శ్రమించి కొండచిలువను పట్టుకుంది. అనంతరం దానిని సురక్షితంగా అడవిలో వదిలేశారు. ఇదీ చదవండి: వరదలో చిక్కుకున్న వృద్ధురాలిని మోసుకెళ్లిన ఆశా వర్కర్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది