© 2026 nimisham.in

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Punjab school Fee Annual Hikes: పంజాబ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపు అంశంపై వివాదాలు కొనసాగుతున్న తరుణంలో సంచలన ప్రకటన చేసింది. ప్రైవేట్ స్కూల్స్ ఏడాదికి 5 శాతం ఫీజులు పెంచుతున్న క్రమంలో గత 3ఏళ్లుగా పెంచిన ఫీజులను తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ విద్యాసంస్థలను వదిలే ప్రసక్తే లేదన్నారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాల అయితే 15శాతం కంటే ఎక్కువగా వసూలు చేశాయో ఆ పాఠశాలలు అధికంగా వసూలు చేసిన ఫీజును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఒక పాఠశాల 3 సంవత్సరాల్లో ఫీజును 25 శాతం పెంచితే.. తమ ఫీజులో అదనంగా వసూలు చేసిన 10శాతం ఫీజును తిరిగి ఇచ్చేయాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు నియంత్రణ మాట్లాడుతూ..ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజును నియంత్రించేందుకు తక్షణమే ఆర్డినెన్స్ ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ ఖటారియా.. పంజాబ్ రెగ్యూలేషన్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఆర్డినెన్స్ 2026కు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును కేబినెట్ గత జూన్ నెలలోనే క్లియర్ చేసిందని తెలిపారు. ఫీజుల పెంపుపై డిప్యూటీ కమిషనర్స్ అధ్యక్షతన రెగ్యూలేటరీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్యుకేషన్ మాఫీయాను నిర్మూలిస్తామని వెల్లడించారు. ఇప్పటికే తాము రాష్ట్రంలో అనేక రకాల మాఫీయాలకు చెక్
పెట్టామని మరొకదానిపై చర్యలు తీసుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక నిర్ణయమని.. ప్రైవేట్ విద్యా సంస్థలపై అధిక ఫీజు నియంత్రణ చట్టం తీసుకవచ్చిన తొలి రాష్ట్రంగా పంజాబ్ ఉందని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.