
Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జెండా ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోదీ జెండా ఎగురవేయడం ఇది 13వసారి కావడం విశేషం. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ రోజు మనమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ప్రతి హృదయంలో 'వందేమాతరం' ధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కొత్త తీర్మానాలతో సరికొత్త ఉత్సాహంతో దేశం ముందుకు సాగుతోంది. గతంలో ఐదు బలహీన దేశాల జాబితాలో ఉన్న భారత్.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అని మోదీ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు