మలయాళంలో తెరకెక్కిన సంచలన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ప్రేమలు’తో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ మమితా బైజు . రీనూగా తన సహజ సిద్ధమైన నటనతో యువతను ఫిదా చేసిన ఈ భామ, ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. తమిళంలో కోలీవుడ్ స్టార్ సూర్య సరసన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ‘విశ్వనాథ్‌అండ్‌సన్స్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. ఒకే నెలలో మూడు విభిన్న భాషల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ కేరళ కుట్టి తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ కెరీర్ విశేషాలను షేర్ చేసుకుంది.* హీరోగా విమర్శలు.. ఆ సంఘటనతోనే డైరెక్టర్‌గా మారాల్సి వచ్చింది - వెంకీ అట్లూరిసోషల్ మీడియాకు దూరంనేటి డిజిటల్ యుగంలో క్రేజ్ కోసం సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే నటీనటులకు భిన్నంగా తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు మమిత తెలిపింది. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. సినిమా అప్డేట్లను ఇకపై కేవలం తన పీఆర్ టీమ్ మాత్రమే వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాలు తెచ్చిపెట్టే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతే తనకు అత్యంత ముఖ్యమని పేర్కొంది.అల్లు అర్జున్‌కు డైహార్డ్ ఫ్యాన్ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని మమితా బైజు బయటపెట్టింది. తాను బన్నీకి డైహార్డ్ అభిమాననని, ఆయన నటించిన ప్రతి సినిమాను కనీసం పదిసార్లు రిపీట్ మోడ్‌లో చూస్తానని చెప్పింది. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో అల్లు అర్జున్ పెట్టుకున్న క్యాసియో వాచ్ నచ్చి తాను కూడా అలాంటి వాచ్ధరించేదాన్నని, ఆయన తరహాలోనే షర్ట్ల మీద టామ్‌బాయ్‌లా ఉండే టీషర్ట్లు వేసుకుని తిరిగేదాన్నని అనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. కుటుంబంలో తన అన్నయ్య మిథున్ తనకు మంచి స్నేహితుడని, తన జీవితంలో ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటాడని తెలిపింది. తన పెళ్లి విషయంతో పాటు తనకు