
మార్కాపురం: ప్రభుత్వం ఈనెల 22వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ముంపు గ్రామాలు ప్రజల తరలింపు, ఇతర సమస్యలపై బుధవారం మార్కాపురం కలెక్టర్ ఎమ్. విజయసునీత జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజల తరలింపు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిస్థితులను బట్టి ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై కలెక్టర్ తగు సూచనలు చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు క్షుణ్ణంగా వివరించారు. పరిహారం విషయంలో అర్హత ఉన్న అందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ సురేష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్, డ్వామా పీడీ సువార్త, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, డిఇఓ సుబ్బారావు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు