
భారత మార్కెట్లో పోవా 8 ప్రో 5జీ సేల్స్ ప్రారంభం రూ. 3వేలు బ్యాంకు డిస్కౌంటుతో ఈ ఫోన్ మీ సొంతం గేమింగ్ ఫోన్ కొనేవారికి ఇదే అద్భుతమైన ఆఫర్ Pova 8 Pro 5G Sale : కొత్త పోవో ప్రో 5జీ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో పోవా 8 ప్రో 5జీ సేల్స్ ప్రారంభమయ్యాయి. టెక్నోకు చెందిన ఈ పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ నథింగ్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. అదనంగా, బ్యాక్ ప్యానెల్లో యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంది. కంపెనీ ఫస్ట్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 3వేలు డిస్కౌంట్ అందిస్తుంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.. పోవా 8 ప్రోపై భారీ ఆఫర్లు : భారత మార్కెట్లో పోవా 8 ప్రో ఫోన్ 2 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 49,999కు లభిస్తోంది. టాప్-ఎండ్ 12GB ర్యామ్ + 512GB వేరియంట్ ధర రూ. 54,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ధర రూ. 46,999కు లభిస్తోంది. ఈ టెక్నో ఫోన్ ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.. పోవా 8 ప్రో ఫీచర్లు : ఈ గేమింగ్ ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే 4500 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ డిస్ప్లేలో హైపర్‌లక్స్ టెక్నాలజీని వాడింది. ఈ ఫోన్ IP69K రేటింగ్‌తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. Read Also : AI Trust Rankings : అన్ని ఏఐలనూ నమ్మొచ్చా? ది బెస్ట్ ఏఐ కంపెనీ ఇదే