
ఇటీవలి కాలంలో ప్రకృతి ప్రేమికుల సంఖ్య పెరిగింది. వీక్ మొత్తం బిజీ బిజీగా గడిపిన వాళ్లు వీకెండ్ లో అలా ప్రశాంతంగా ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో సేద తీరాలని భావిస్తుంటారు. అందుకే ఇటీవలి కాలంలో పర్యటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక చాలామంది ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టిరావాలని అనుకుంటారు. తక్కువ బడ్జెట్ లోనే బీచ్ అందాలు, ప్రకృతి సోయగాల మధ్య హ్యాపీగా గడపాలని అనుకుంటారు. అయితే వారికి ఏ ప్రదేశాలకు వెళ్లాలో తెలియదు. ఇక తమిళనాడులో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడులో హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు నిలయంగా ఉంది. తమిళనాడులో హిల్ స్టేషన్లు చాలానే ఉన్నాయి. ఊటీని హిల్ స్టేషన్స్ కు రాణిగా పిలుస్తుంటారు. అలాగే కొడైకెనాల్, ఏర్కాడ్ తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఇక బీచ్ లు అయితే మహాబలిపురం, కన్యాకుమారి, రామేశ్వరం ఉన్నాయి. అయితే కొడైకెనాల్ లో కొడై సరస్సు, కోకర్స్ వాక్, పిల్లర్ రాక్స్ ప్రసిద్ధి చెందినవి. ఇక పూంబరై గ్రామం గురించి చాలామందికి తెలియదు. ఈ హిల్ విలేజ్ కు వెళ్తే ఇతర ప్రపంచానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. కొడైకెనాల్ కు సమీపంలోనే ఈ హిల్ విలేజ్ ఉంది. పచ్చని కొండలు, రంగు రంగుల ఇళ్లు, టెర్రేస్ ఫామ్స్ ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందాయి. కొడైకెనాల్ కు వచ్చే పర్యటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతంగా ఇది ఉంది. పూంబరై పర్యటక ప్రాంతాన్ని సందర్శించాలని అనుకునేవారు కుజంతై వేలప్పర్ ఆలయం(మురుగన్ గుడి) ను సందర్శించాల్సి ఉంటుంది. ఇది మూడువేల సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రం. ఇక్కడి మురుగన్ విగ్రహం చాలా ఫేమస్. అలాగే పూంబరై విలేజ్ వ్యూ పాయింట్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి చూస్తే కొండల మధ్యలో మెట్ల ఆకారంలో సాగయ్యే పొలాలు, రంగురంగుల ఇళ్లు.. ఓ అద్భుతమైన పెయింటింగ్ మాదిరి కనిపిస్తుంటుంది