
ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కమిషనరేట్ పరిధిలో వందల్లో పోస్టుల ఖాళీ పోలీసుల కొలువుల సాధనకు సన్నద్ధమవుతున్న యువత బెల్లంపల్లి(మంచిర్యాల): పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పలువురు కోచింగ్ సెంటర్లకు వెళ్తుండడంతో సందడి మొదలైంది. కమిషనరేట్ పరిధిలో వందల పోస్టులు ఖాళీలు... కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో పోలీసు కొ లువులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం పో లీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత(లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపించినట్లు అధికారులు ప్రకటిం చారు దీంతో స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు కూడ గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు భావిస్తు న్నారు. జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 1875 మంది పోలీసులకు గాను 1334 మంది విధులు నిర్వహి స్తున్నారు. 541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్‌కు సంబంధించి 1325 పోస్టులకు గా ను 819 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 506 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏఆర్ కానిస్టే బుళ్లు 563కు గాను 485 మంది విధులు నిర్వహిస్తు న్నా రు. 78 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరుగుపందెం, పరీక్షలో నెగ్గితేనే... పోలీసు ఉద్యోగం సాధించాలంటే పరుగుపందెంతో పాటు పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పురుషులైతే రన్నింగ్ 1600మీటర్లు(7.15నిమిషాల్లోపు), లాంగ్‌జంప్ నాలుగుమీటర్లు, షాట్‌ఫుట్ 6మీటర్లు, మ హిళలు పరుగుపందెంలో 800 మీటర్లు (5.20నిమి షాలు), లాంగ్‌జంప్ 2.5మీటర్లు, షాట్‌ఫుట్ 4 మీటర్ల