లాక్కెళ్తుంటారు.నీ కోరిక తీరుతుంది.. ఇన్నాళ్లకి నా ఆకలి తీరిందే బాలా.. రావడానికి ఇన్నేళ్లు పట్టిందా.. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.. నీది పెద్ద మనసు.. నీ కోరిక తీరుతుంది.. నేను ఇవ్వాలని అనుకున్నది కూడా నీకు చేరుతుంది.. సంతోషంగా ఉందే బాలా అని మహా చేతిలో ఉన్న నైవేద్యాన్ని తీసుకుని తింటుంది ఆ వ్యక్తి. ఇక పెద్ది వద్దకు వెళ్లి.. రావడానికి ఇన్ని రోజులు పట్టిందా? అని అంటుంది. మాకు సిద్దాంతి చెప్పే వరకు ఈ విషయం తెలీదు అమ్మా అని అంటాడు మాధవ. ఇప్పుడు వచ్చారు.. నాకు మనసు నిండింది అని ఆ వ్యక్తి అంటుంది.నువ్వు మగాడివేనారా? నేను వేరే వ్యక్తిని ప్రేమించాను.. అండి.. వాడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. వీళ్లు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు అని శైలు అంతా చెబుతుంటుంది. ఇదంతా నాకు తెలుసండి అని ప్రకాష్ అంటాడు. అంటే తెలిసే చేసుకుంటున్నావా? ఇదంతా మీరు పకడ్బంధీగా చేశారన్న మాట.. రేయ్ అసలు నీకు సిగ్గు లేదా? నువ్వు మగాడివేనారా? వేరే వాడ్ని లవ్ చేస్తున్నా అని చెప్తే కూడా పెళ్లికి రెడీ అయ్యావ్.. ఇది ఎంగిలి ఆకులో తినడంతో సమానం రా అని శైలు పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుంది. దీంతో వరాలుకి కోపం వచ్చి శైలుని కొడుతుంది.తాళి కట్టేందుకు.. మాట్లాడింది చాలు ఇక ఆపు అని వరాలు కొడుతుంది. రేయ్ బావ నువ్వు తాళి కట్టురా.. మేం దీన్ని పట్టుకుంటాం అని అంటాడు సురేష్. నాన్నా ఇదేంటి నాన్నా అని ధీనంగా అడుగుతుంది శైలు. కానీ శేఖరం మాత్రం ఏమీ మాట్లాడడు. సురేష్ గాడేమో తాళి కట్టేందుకు రెడీ అవుతుంటాడు. ఎవరైనా కాపాడండి.. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి అని శైలు మొత్తుకుంటూ ఉంటుంది. నిన్ను కాపాడేందుకు ఎవ్వడూ రాడు.. ఇక్కడ ఆ కేశవ గాడు కూడా లేడు అని అంటాడు సురేష్. ప్రకాష్ ఏమో తాళి కట్టేందుకు రెడీ అవుతాడు.నీకు ప్రతీ ఏడాది పండుగే.. సిద్దాంతి చెప్పే వరకు మాకు తెలీదు అమ్మా అని మాధవ అంటాడు. అందరి మనసులో స్థానం సంపాదించుకున్నావ్.. ఇకపై నీకు ప్రతీ ఏడాది పండుగే.. అని ఆశీర్వదిస్తుంది. ఇక తాయారాని కోపం చూస్తూ ఆమె వైపుగా వెళ్తుంది. నీ నోటి దురుసు తగ్గించుకో.. నేను రాసిన రాతని మార్చాలని చూస్తావా? పుట్టింటికి శాపం పెడతావా? ఇకనైనా అదుపులో ఉండు అని తిడుతుంది. సరే అమ్మా అని తాయారు అంటుంది. జై రుద్రాంబిక అని అందరూ ఒక్కసారిగా నినాదాలు చేస్తుంటారు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది అని కేశవ, కన్నా అందరూ మాట్లాడుకుంటారు.నేను ప్రెగ్నెంట్‌ని.. పెళ్లి నుంచి తప్పించుకోవాలని.. నేను ప్రెగ్నెంట్‌ని, కడుపులో బిడ్డ ఉందని చెబుతుంది శైలు. ఆ మాటతో తాళి కట్టే వాడు కట్టకుండా ఆగిపోతాడు. వరాలు, సురేష్, శేఖరం షాక్‌లో ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావే అని వరాలు అంటే.. అవును నేను రెండు నెలల గర్భవతిని అని శైలు అంటుంది. ఇప్పుడు కూడా కట్టాలనుకుంటే తాళి కట్టు.. కానీ నా బిడ్డ మాత్రం కేశవ రక్తమే.. నువ్వు నన్ను ముట్టుకున్నా వాడు ముట్టుకున్నట్టే ఫీల్ అవుతాను అని శైలు చెబుతుంది. దీంతో ఆ ప్రకాష్ సైలెంట్ అయిపోతాడు.ఆమె ఎన్ని అన్నా కూడా భరించాను.. ఇది అబద్దాలు ఆడుతోంది.. ఇది నిజం కాదు.. పెళ్లి చేసుకో బాబు అని వరాలు అంటుంది. మీకు డౌట్‌గా ఉంటే హాస్పిటల్‌కి పదండి.. చెక్ చేద్దాం అని శైలు అంటుంది. ఇలాంటి విషయంలో ఏ ఆడపిల్ల కూడా అబద్దం చెప్పదు ఆంటీ.. నేను శైలుని ప్రేమించాను. అందుకే ఆమె ఎన్ని అన్నా కూడా భరించాను.. మీరు నాకు అన్నీ చెప్పారని అనుకున్నా.. అసలు విషయం దాచారని తెలీదు అని ప్రకాష్ అంటాడు. బాబు.. పెళ్లిని మాత్రం ఆపొద్దు అని వరాలు అంటే.. ఆల్రెడీ ఆగిపోయింది ఆంటీ అని అంటాడు ప్రకాష్. అమ్మాయిని చేసుకుంటాను కానీ.. అమ్మని ఎలా చేసుకోను అని వెళ్లిపోతాాడు.పెద్ది కోసం ఏమైనా చేస్తా.. మీ చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాయండి.. అని చక్రి అడుగుతాడు. ఇప్పుడు పర్లేదు అండి.. కాస్త బెటర్.. ఆయిల్ రాసుకున్నాను అని మహా అంటుంది. అయినా మీరు నా చేతులు కాలిపోకుండా వేపాకులు ఇచ్చారు.. నడుస్తుంటే నీళ్లు పోశారు.. ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చారు కదా థాంక్స్ అని అంటుంది మహా. మా కుటుంబానికి ఇంత చేసిన మీకే నేను థాంక్స్ చెప్పాలని చక్రి అంటే.. ఇది మన కుటుంబం.. పెద్ది నాకు కావాల్సిన వాడు.. పెద్ది కోసం నేను ఏమైనా చేస్తాను అని మహా అంటుంది.బయటకు వెళ్దామా? నాకు ఇక్కడే ఉండి బోర్ కొడుతోంది.. అలా ఊర్లోకి వెళ్లొద్దామా? అని చక్రిని మహా అడుగుతుంది. దీంతో చక్రి తెగ సంబర పడిపోతాడు. వెళ్దాం పదండి.. మీరు అడగడం.. నేను కాదనడమా? అని చక్రి అంటాడు. మరి ఎలా వెళ్దాం.. బైక్ లేదు కదా.. అని మహా అంటే.. బయట గుర్రం ఉందండి అని చక్రి కామెడీ చేస్తాడు. గుర్రమా? అని మహా అంటే.. గుర్రం అంటే గుర్రం కాదు.. సైకిల్ ఉందని అంటాడు చక్రి. ఇక్కడ మీకు సైకిల్ ఎవరు ఇచ్చారు? అని మహా అంటే.. మీకు వివరాలు కావాలా? బయటకు వెళ్లడం కావాలా? అని చక్రి అంటాడు.Screenshot 2026-08-18 064223