© 2026 nimisham.in

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Poco M8x 5g Price: ఎప్పటినుంచో మంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కొన్ని రోజుల తరబడి బ్యాకప్ బ్యాటరీని ఇచ్చే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో పాటు హెవీ బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7900mAh భారీ బ్యాటరీ.. ఈ ఫోన్లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు.. మార్కెట్లోకి విడుదల కాబోయే ఈ Poco M8x 5G మోడల్ ఏకంగా 7900mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంటల తరబడి గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదని త్వరలోనే కంపెనీ క్లైమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అద్భుతమైన డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్.. ఈ Poco M8x 5G మొబైల్లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 (Snapdragon 4 Gen 5 - 4nm) ప్రాసెసర్‌ను
కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. భారీ గేమింగ్ సమయంలో మొబైల్ వేడెక్కకుండా ఉండేందుకు అద్భుతమైన ట్రిపుల్ కూలింగ్ సొల్యూషన్ (Thermal Management) కూడా కంపెనీ అందించిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ 6.9-అంగుళాల భారీ ఐపీఎస్ ఎల్సీడీ (IPS LCD) డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది.
కెమెరా, ఓఎస్ ఫీచర్లు.. కెమెరా ప్రియుల కోసం.. ఈ ఫోన్ వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే అద్భుతమైన సెల్ఫీలు, మంచి వీడియో కాల్స్ కోసం.. ఇందులోని ఫ్రంట్ భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత పోకో హైపర్ ఓఎస్ (Poco HyperOS) తో ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సమచారం ప్రకారం.. ఈ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని దీని ధర కేవలం రూ.19,999కే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.