
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ఫీచర్ ఫోన్ల ద్వారా యూపీఐ విధానంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఫోన్‌పే కొత్త సర్వీసును ప్రకటించింది. ’ఫోన్‌పే యూపీఐ 123పే’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. దీనితో దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు యూపీఐ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చిన తొలి అగ్రగామి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా నిల్చినట్లు సంస్థ తెలిపింది. ఎస్ఎంఎస్ ఆధారిత సాంకేతికతతో, 2జీ కనెక్టివిటీ పరిమిత స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ సర్వీసు పని చేస్తుంది. కెమెరాలు కూడా ఉన్న ఫీచర్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌కి సైతం సపోర్ట్ ఉంటుంది. డివైజ్‌లలో ఈ ఫీచరును ముందుగానే పొందుపర్చి అందించేలా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలైన నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ (ట్రాన్షన్ హోల్డింగ్స్)తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగం తెలిపారు. అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు