
ఫోన్‌పే తన ప్లాట్ఫామ్లో పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఫిక్స్డ్ డిపాజిట్ సేవలను ప్రారంభించింది. దీంతో వినియోగదారులు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే వివిధ బ్యాంకుల FDలను పోల్చి చూసి తమకు నచ్చిన డిపాజిట్‌ను వెంటనే బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో చేసిన FDలను కూడా ఒకే యాప్‌లో సులభంగా నిర్వహించుకోవచ్చు. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన FDలకు రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది. ఫోన్‌పే ప్రవేశపెట్టిన డైలీ RD ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో రోజుకు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆటోమేటిక్‌గా పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా యువత, ఉద్యోగులు, చిన్న మొత్తాలతో సేవింగ్స్ ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. UPI ఆటోపే ద్వారా ప్రతిరోజూ నిర్ణయించిన మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. వరుసగా 15 రోజుల వరకు డబ్బు జమ కాకపోయినా ఎలాంటి జరిమానా ఉండదు. అలాగే డిపాజిట్ చేసిన తర్వాత కేవలం 7 రోజులకే అవసరమైతే డబ్బు ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు. కావాలంటే ఆటోపే మాండేట్ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ఫోన్‌పే యాప్‌లోని "Mutual Funds & Deposit" విభాగంలో Fixed Deposits లేదా Daily RD ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న భాగస్వామ్య బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీని ఎంపిక చేయాలి. తర్వాత డిపాజిట్ కాలపరిమితిని 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఎంచుకుని పెట్టుబడి మొత్తాన్ని నమోదు చేయాలి. అనంతరం PAN, ఆధార్ ద్వారా డిజిటల్ ధ్రువీకరణ పూర్తి చేసి, నామినీ వివరాలు నమోదు చేయాలి. చివరగా PhonePe UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తే వెంటనే FD పూర్తవుతుంది. డైలీ RD కోసం UPI ఆటోపే అనుమతిని