© 2026 nimisham.in

పవర్ బటన్ నొక్కినా ఫోన్ ఆన్ కాలేదా?

ఫోన్ ఒక్కసారిగా డెడ్ అయిందా?

ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ చేయండి

Tech Tips : మీ ఫోన్ ఆన్ కావడం లేదా? ఛార్జింగ్ కూడా ఎక్కడం లేదా? అయితే, మీ ఫోన్ పాడైందా? లేదా హ్యాంగ్ అయిందా? తప్పక తెలుసుకోవాలి. చాలామంది తమ ఫోన్ ఒక్కసారిగా ఆన్ కాకపోతే వెంటనే టెన్షన్ మొదలవుతుంది. తమ ఫోన్ పూర్తిగా పాడైందని కంగారుపడిపోతుంటారు.

కానీ, ప్రతిసారీ ఫోన్ ఆన్ కాకపోవడానికి అదే కారణం కాకపోవచ్చు. అందుకు (Tech Tips) చాలానే కారణాలు ఉంటాయి. అందులో అది బ్యాటరీ, ఛార్జర్ లేదా చిన్న సాఫ్ట్వేర్ సమస్య కారణమైనా కూడా మీ ఫోన్ ఆన్ కాకపోవచ్చు. సర్వీస్ సెంటర్‌కు వెళ్లే ముందు ఈ 6 మార్గాల్లో ట్రై చేసి చూడండి..

1. కొంతసేపు ఛార్జింగ్ పెట్టండి :
బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినా కూడా వెంటనే ఫోన్ ఆన్ కాదు.. స్క్రీన్‌పై డిస్ ప్లే రావాలంటే కొద్దిగా అయినా ఛార్జింగ్ ఎక్కాలి. మీ దగ్గర మంచి ఛార్జర్, కేబుల్‌తో కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఛార్జింగ్ పెట్టండి.

2. ఛార్జర్, కేబుల్ మార్చి చూడండి :
అసలు సమస్య మీ ఫోన్లో కాకుండా ఛార్జర్ లేదా కేబుల్‌లో కూడా ఉండొచ్చు. ఓసారి ట్రై చేయండి.

3. ఛార్జింగ్ పోర్ట్ చెక్ చేయండి :
పోర్ట్‌లో డస్ట్ పేరుకుపోయినా ఛార్జింగ్ ఎక్కదు. ఒకవేళ ఈ కారణమైతే ఓసారి జాగ్రత్తగా క్లీన్ చేయండి.

Read Also : WhatsApp Profile Photo : వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఫొటో అందరికి కనిపించొద్దా? ఈ చిన్న సెట్టింగ్‌తో హైడ్ చేసేయండి..

4. ఫోర్స్ రీస్టార్ట్ చేయండి :
చాలా ఫోన్లలో పవర్, వాల్యూమ్ డౌన్ బటన్లను 10 సెకన్ల నుంచి 15 సెకన్లు ట్యాప్ చేసి ఉంచితే రీస్టార్ట్ అవుతుంది.

5. సేఫ్ మోడ్ :
మీ ఫోన్లలో రీసెంట్ ఇన్స్టాల్ చేసిన యాప్ వల్ల ఈ సమస్య వస్తే సేఫ్ మోడ్‌లోకి వెళ్లి ఆ యాప్‌ను డిలీట్ చేయొచ్చు.

6. రీసెట్ :
అన్ని రకాలుగా ట్రై చేసినా ఫలితం లేదంటే చివరిసారిగా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఒక్కటే మార్గం.. అయితే, ఇందులో ఈ సెట్టింగ్ టచ్ చేస్తే మీ ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది జాగ్రత్త..

ఫోన్ కింద పడిపోవడం జరిగినా లేదా నీటిలో పడటం వంటి కారణాలతో కొన్నిసార్లు మొబైల్ ఫోన్లు హ్యాంగ్ అయిపోతాయి.