
Phone Hacking : సైబర్ మోసాలు, ఫోన్ హ్యాకింగ్స్ ఇటీవల పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్ని వదలట్లేదు హ్యాకర్లు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో పలువురి ఫోన్స్ హ్యాకింగ్ కి గురయ్యాయి అని సమాచారం. ఒకప్పటి స్టార్ నిర్మాత ఫోన్ ఇటీవల హ్యాక్ అయి అతని ఫేస్ బుక్ నుంచి చాలా మందికి మెసేజ్ లు వెళ్లాయట. ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉన్న APK ఫైల్ ని అందరికి పంపారట. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అవతలి వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అయిపోయినట్టే. అలా ఆ సీనియర్ నిర్మాత నుంచి మెసేజ్ లు వెళ్లడంతో సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు ఆయనకు, ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్లకు ఫోన్స్ చేస్తే ఆయన ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం బయటపడింది. అంతే కాకుండా ఆయన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి భారతదేశం నంబర్ కాకుండా వేరే నంబర్స్ తో మెసేజ్ లు కూడా వెళ్లాయట. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫోన్ కూడా హ్యాక్ అయింది. ఆయన ఫోన్ కూడా ఇదే పద్దతిలో హ్యాక్ అయి అతని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి వాట్సాప్ ద్వారా ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉన్న APK ఫైల్ ని పంపారట. ఆ ఫైల్ డౌన్లోడ్ చేస్తే అవతలి వ్యక్తి ఫోన్ కూడా హ్యాక్ అయినట్టే. ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ హ్యాక్ చేసి అతని అకౌంట్ నుంచి డబ్బులు కూడా దోచేసారు హ్యాకర్స్. దీంతో సినీ పరిశ్రమలో ఈ ఫోన్స్ హ్యాకింగ్ కలకలం సృష్టిస్తుంది. దీంతో జాగ్రత్త అంటూ, ఎలాంటి తెలియని మెసేజ్ లు, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వొద్దని, ఎలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మీరు కూడా తెలియని నంబర్స్ నుంచి కాల్స్, మెసేజ్