
శాలరీలో కట్ చేసినా.. కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయలేదా..?శాలరీలో కట్ చేసినా.. కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయలేదా..? Venkatrao Lella Images: Pinterest 16 AUG 2026 నిబంధనల ప్రకారం ప్రతీ కంపెనీ ఉద్యోగి నుంచి కట్ చేసిన అమౌంట్‌తో పాటు తాము అందించే PF కాంట్రిబ్యూషన్‌ను తర్వాతి నెల 15వ తేదీలోగా ఈపీఎఫ్ అకౌంట్లో ఖచ్చితంగా జమ చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన ఈ టైమ్‌లోగా జమ చేయాలి. ఉదాహరణకు జూలై నెలకు సంబంధించిన PF కాంట్రిబ్యూషన్.. ఆగస్టు 15వ తేదీలోగా జమ చేయాలి. కంపెనీ మీ జీతం నుండి PFని కట్ చేస్తే.. దానిని వేయకుండా ఉంటే చర్యలు ఉంటాయి. కంపెనీ డబ్బులు జమ చేయడంలో ఆలస్యం చేస్తే వడ్డీ విషయంలో నష్టం ఏమీ జరగదు. ఆలస్యంగా చెల్లింపు చేసిన కంపెనీపై సెక్షన్ 7Q కింద వడ్డీ పొందటం, సెక్షన్ 14B కింద నష్టపరిహారం పొందవచ్చు. కంపెనీ ఆలస్యం చేసింది కాబట్టి.. కంపెనీనే ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. కంపెనీనే ఉద్యోగికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. జీతం స్లిప్‌లో పీఎఫ్ తీసివేసినట్లు చూపించినా.. ఆ మొత్తం ఈపీఎఫ్ఓలో జమ కాకపోతే ఉద్యోగి దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈపీఎఫ్ పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోవాలి. హెచ్ఆర్ లేదా కంపెనీ పేరోల్ లేదా అకౌంట్స్ విభాగం నుండి రాతపూర్వకంగా సమాచారం కోరాలి. ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ సెల్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. EPFO "విశ్వాస్ 2026" అనే కొత్త పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ పథకం కింద జరిమానాల చెల్లింపుపై కంపెనీలకు గణనీయమైన రాయితీలు అందించారు జూన్ 2024లో ప్రతిఒక్కరికీ ఇది 1%గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని మాఫీ చేశారు. రెండు నెలల ఆలస్యం జరిగితే 0.25% జరిమానా మాత్రమే విధిస్తారు. 4 నెలల వరకు ఆలస్యం జరిగితే 0.50% జరిమానా ఉంటుంది. 4 నెలలు