© 2026 nimisham.in

Peddi Full Cast Remunarations: ఆర్ఆర్ఆర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం రామ్ చరణ్ ఎదురు చూస్తున్నారు. రాజమౌళితో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలివడంతో ఇపుడు రాబోయే ‘పెద్ది’ సినిమాతో పెద్ద హిట్ కొట్టాల్సిన పరిస్థితి రామ్ చరణ్‌కు ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 4న విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వృద్దీ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు రూ. 100 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా కుస్తీ పోటీల కోసం ఓ వస్తాదులా రామ్ చరణ్ ట్రాన్ఫార్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువ. అంతేకాదు ఈ సినిమా కోసం క్రికెట్ ఇతర క్రీడల్లో మంచి తర్ఫీదు తీసుకున్నాడు. ఈ సినిమా హిట్ అనేది రామ్ చరణ్‌కు అత్యంత కీలకం. ఉప్పెన వంటి భారీ సక్సెస్ తర్వాత మరోసారి మెగా హీరో రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తరహా కథతో ఒప్పించడం మాములు విషయం కాదు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు దాదాపు మూడేళ్లు కేటాయించాడు. ఓ రకంగా ఈ సినిమా సక్సస్ అనేది హీరోగా రామ్ చరణ్‌తో పాటు దర్శకుడిగా బుచ్చిబాబుకు కూడా అత్యంత కీలకం అని చెప్పాలి. ఈ సినిమా కోసం బుచ్చిబాబు రూ.
30 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.
‘పెద్ది’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ ‘గౌర్ నాయుడు’గా నటించారు. తెలుగులో పూర్తిస్థాయిలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే. గతంలో బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో ఓ పాటలో మెరిచారు. ఈ సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో శివరాజ్ కుమార్ పై బిజినెస్ జరగడం విశేషం. అక్కడ రామ్ చరణ్ కు మంచి మార్కెట్ ఉన్నా.. శివరాజ్ కుమార్ ఉండటం అదనపు అస్సెట్ అని చెప్పాలి.
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా తర్వాత జాన్వీకపూర్ నటించిన రెండో చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ రూ. 6 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో మెప్పించింది. మరోవైపు ప్రత్యేక గీతంలో నర్తించిన శృతి హాసన్ రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న మాట.
‘మీర్జాపూర్’ సిరీస్‌లో మున్నాగా తన యాక్టింగ్ ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇతను తెలుగులో నటించిన తొలి చిత్రం ‘పెద్ది’ కావడం విశేషం. ఈ సినిమా కోసం దివ్యేందు శర్మ.. రూ. 7 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల కథనం. ఈ సినిమాలో రామ్ బుజ్జి పాత్రలో నటించాడు.
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమా కోసం దాదాపు రూ. 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న మాట. ఈ చిత్రంలో దేవన్ పాత్రలో నటించారు.
జగపతి బాబు ‘పెద్ది’ సినిమాలో ‘అప్పలసూరి’ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పూర్తిగా మారిపోయి సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు పలు కథనాలు వెలుబడ్డాయి.