
మెగా అభిమానులకు త్వరలోనే పూనకాలు తెప్పించే వార్త రాబోతోంది. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ట్రీట్ ఇవ్వబోతున్నారు. మెగా అభిమానులకు త్వరలోనే పూనకాలు తెప్పించే వార్త రాబోతోంది. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే నెలలో షూటింగ్స్ ప్రారంభించబోతున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓజీ 2’ పట్టాలెక్కేందుకు ముస్తాబవుతోంది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా తన అందం, అభినయంతో ఆకట్టుకోగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘RC17’ చేయనున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ బ్లాక్‌బస్టర్ జోడీ కలవనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రం నవంబర్