
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కంబరలో మంగళవారం మన మాట.. మన బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని పాఠశాల ఆవరణలో విద్యార్థులతో బంతి మొక్కలు నాటించారు. పొలం గట్టుపై మొక్కలు నాటారు. పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ.. దసుమంతపురం జియమ్మవలస మండలం రావివలస గ్రామాలకు బీటీ రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏపీడీ ప్రభావతి, తోటపల్లి ప్రాజెక్ట్ ఛైర్మన్ పొదిలాపు విజయరమణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. లలితకుమారి, తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.