
బలిజిపేట గ్రామీణం: పూర్వ ప్రాథమిక విద్య పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు సాధించవచ్చని జ్ఞానజ్యోతి కోర్స్ కోఆర్డినేటర్ ఎస్.సింహాచలం అన్నారు. ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి కార్యక్రమంపై ఆరు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోర్స్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక విద్య విద్యావ్యవస్థకు పునాదివంటిదని, మారుతున్న నూతన విద్యావిధానాలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలన్నారు. రాష్ట్రప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. మొదటి రోజు శిక్షణలో నవచేతన, ఆధార్ శిల అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో రాజ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు