
కురుపాం గ్రామీణం: విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కురుపాం విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం కురుపాం మండల కేంద్రంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వైర్లపై తడి బట్టలతో గాని, తడి చేతులతోగాని ఎవరూ తాకరాదన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉంటుందన్నారు. కరెంట్ సరఫరా లేదు అనుకుని వాటిని చేతితో గాని, కాలితో గాని తాకరాదని తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని, నాణ్యమైన పరికరాలనే వాడాలని వెల్లడించారు. ప్రమాదాల బారిన పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, షాపుల సిబ్బంది, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



