
దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయీ సంఘం గట్టిగా సిఫారసు చేసింది. 20 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.యువతలో కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతుండటంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధి ముదిరి చివరి దశకు చేరుకునే వరకు చాలామందికి తమ కిడ్నీలు దెబ్బతిన్నాయనే విషయమే తెలియడం లేదని పేర్కొంది. మధుమేహం, అధిక రక్తపోటు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా ఉన్నప్పటికీ, వ్యవసాయ కూలీలు, కఠిన వాతావరణంలో పనిచేసే వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. తీవ్రమైన ఎండలు, డీహైడ్రేషన్, పురుగుమందుల వాడకం, కలుషిత నీటిలోని భార లోహాల ప్రభావంపై లోతైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా 'ఉద్దానం' ప్రాంతంలో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధుల గురించి కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని, పేదలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.ప్యానెల్ కీలక సిఫారసులుప్రస్తుతం చేస్తున్న సీరం క్రియాటినిన్ పరీక్ష మాత్రమే సరిపోదని ప్యానెల్ స్పష్టం చేసింది. కిడ్నీలు 50 శాతం దెబ్బతినే వరకు ఈ పరీక్షలో ఫలితం సాధారణంగానే కనిపిస్తుందని వివరించింది. అందువల్ల, క్రియాటినిన్తో పాటు తప్పనిసరిగా eGFR, యూరిన్ అల్బుమిన్