
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. మొత్తం 31 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేయగా.. ఇందులో 21 మంది లోక్సభ, పది మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతా : అమిత్ షా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (సవరణ) బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మైనారిటీలు, ఎన్జీవోలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని, తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందిస్తూ.. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేలా ఎలాంటి నిబంధనలు ఇందులో లేవని, ఈ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు